పాయల్ రాజ్ పుత్ ఈ పేరు అందరికి సుపరిచితమే. తన అందాలతో, నటనతో కుర్రకారుని కట్టిపడేసింది. ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్లను తనకు అభిమానులుగా మార్చేసింది. తన మొదటి సినిమా ఆర్ఎక్స్-100 సినిమాలో తన అందాలతో, బోల్ట యాక్షన్‌తో అందరి దృషిని ఆకర్షించింది. కానీ ఆమెకు ఆశించిన విదంగా సినిమా అవకాశాలు రాలేదు. వేంకీ మామ వంటి క్లాసిక్ సినిమా చేయకమందు కొన్ని బోల్డ్ సినిమాలకు ఓకే చెప్పి తప్పు చేసిందనే చెప్పుకోవచ్చు. దాంతో ఈ అమ్మడు వెబ్ సిదీస్‌లపై దృష్టి పెట్టింది. పాయల్ ఇటీవల చేసిన అనగనగా ఓ అతిథి ఓటీటీలో ప్రస్తుతం బాగానే రాణిస్తోంది. దాంతో మరికొన్ని వెబ్ సిరీస్‌లకు పాయల్ పచ్చ జెండా ఊపింది. ఈ ముద్దుగుమ్మ వెబ్ సిరీస్‌లకే పరిమితమయితే ఇక కుర్రకారుకి పండగనే చెప్పాలి. తన బోల్డ్ నటనతో అందాలు ఆరబోసే పాయల్ బాగా గుర్తింపు తెచ్చుకుంటోంది. అయితే ఇటీవల వెబ్ సిరీస్‌లపై కూడా సెన్సార్ షిప్‌కు ప్రభుత్వం ఓకే చెప్పింది. దాంతో పాయల్ సరైన సమయంలో ఓటీటీలో అడుగుపెట్టలేదని చెప్పకోవచ్చు. పాయల్ ఇప్పటికే మరికొన్ని వెబ్‌సిరీస్‌లకు సంతకాలు చేసేసింది.
previous post
next post
స్నేక్ బాబు… ఏడేళ్ళు వాళ్ళ కూడు తిని కాటు వేస్తావా ? : శ్రీరెడ్డి