సుధాకర్ కోమాకుల హీరోగా.. బేబి జాహ్నవి సమర్పణలో యునైటడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఎస్.జె.కె.ప్రొడక్షన్స్ (యు.ఎస్.ఎ) వారి సహకారంతో హరినాథ్ బాబు.బి దర్శకత్వంలో డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న చిత్రం “నువ్వు తోపురా”. ఈ చిత్రం ఏప్రిల్ 26న గీతా షిలిమ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో “మాది హైదరాబాద్… ఈడ గల్లీగల్లీకి వైన్ షాప్ ఉంటది… మన గల్లీల ఇజ్జత్ ఉంటది… ఇంకేం కావాల్రా భయ్…” అంటూ హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ ట్రైలర్ లో హీరోయిన్ కోసం హీరో పడే తపన, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లడం, అక్కడ ఉండలేక ఇండియాకు వస్తానని చెప్పడం లాంటి అంశాలు కన్పిస్తున్నాయి. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
previous post
next post