telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాహుల్, పునర్నవిల పెళ్ళికి పేరెంట్స్ గ్రీన్ సిగ్నల్

Rahul-and-Punarnavi

105 రోజుల బిగ్ బాస్ నాగార్జున హోస్ట్‌గా 17 మంది కంటెస్టెంట్స్‌తో జూలై 21 ప్రారంభమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌ సీజన్ 3‌లో ఆదివారం నాడు విజేతను ప్రకటించారు. బిగ్‌బాస్‌ తెలుగు 3 టైటిల్‌ను సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ గెలుచుకున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ రూ.50లక్షల నగదు బహుమతిని దానితో పాటు ఓ ట్రోఫీని అందుకున్న విషయం తెలిసిందే.  రాహుల్ బిగ్ బాస్ విజేతగా అవతరించడంలో పునర్నవి పాత్ర కీలకమే. ఎపిసోడ్ ప్రారంభం నుండి ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ కావడంతో పున్నూ, రాహుల్‌లను లవర్స్‌ని చేసేశారు నాగార్జున. సమయం వచ్చిన ప్రతిసారి ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న భావన ప్రేక్షకుల్లో కలిగిస్తూ ఈ ఇద్దరి మధ్య బంధాన్ని లవ్ ట్రాక్‌గా మలిచారు. ఇది టీఆర్పీ రేటింగ్‌లో భాగమే అయినా.. పున్నూ-రాహుల్‌లు కూడా లవ్, డేటింగ్, రొమాన్స్ అంటూ కథను బాగానే రక్తికట్టించారు. ఇక పున్నూ కోసం రాహుల్ చేసిన త్యాగాలు.. వాటికి కృతజ్ఞ‌తగా పున్నూ పాత కౌగిలింతలు, కిస్‌లకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాహుల్, పునర్నవిల మధ్య రొమాన్స్ బిగ్ బాస్ హౌస్‌లో వేరే రేంజ్‌ కావడంతో ఈ ఇద్దరూ లవ్ ట్రాక్ ఎక్కేశారని నాగార్జునతో పాటు ప్రేక్షకులుకూడా డిసైడ్ అయిపోయారు. రాహుల్ బిగ్ బాస్ విజేతగా అవతరించిన తరువాత పున్నూకి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు రాహుల్. ఈ సందర్భంగా రాహుల్ పేరెంట్స్ వీరి పెళ్లిపై ఓపెన్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరిగిందన్నది వాళ్లకు మాత్రమే తెలుసు. ఒకవేళ వాళ్లు నిజంగా లవ్ చేసుకుని ఉంటే మేం కాదనం. వాళ్లు లోపల లవ్ చేసుకున్నారేమో బయట ఉన్న మాకు తెలియదు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నడుస్తుందనే భావన జనంలో కలిగించారు బిగ్ బాస్ వాళ్లు. అయితే అది వాళ్ల టీఆర్పీ రేటింగ్ గురించి అయినా ఉండొచ్చు. వాళ్లు లవ్ చేసుకుంటుంటే.. వాళ్ల ఇష్టమే మా ఇష్టం. ఫైనల్‌గా వాళ్ల నిర్ణయమే మా నిర్ణయం. తప్పకుండా పెళ్లి చేస్తాం. అయితే వాళ్ల మధ్య అయితే లవ్ ఉందనేది బిగ్ బాస్ హౌస్ వరకే అనుకుంటున్నాం. మాకైతే తెలియదు. వాళ్లతో పాటు ఉన్న మిగిలిన వాళ్లకు తెలుస్తుంది. మాకైతే వాళ్లకు పెళ్లి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు’ అంటూ కుండబద్దలు కొట్టేశారు రాహుల్ సిప్లిగంజ్ పేరెంట్స్.

Related posts