telugu navyamedia
రాజకీయ వార్తలు

మహారాష్ట్రను అనుసరిస్తున్న మధ్యప్రదేశ్…

lockdown corona

కరోనాను ఆతికట్టే నియమాలలో మహారాష్ట్రను అనుసరిస్తుంది మధ్యప్రదేశ్. అయితే ప్రస్తుతం మన దేశంలో నమోదవుతున్నా కరోనా కేసులలో సగం మహారాష్ట్రలోని వస్తున్నాయి. దాంతో అక్కడ వారాంతపు లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. అయితే ప్రస్తుత మన దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది.  కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. మధ్యప్రదేశ్ లో వారాంతాల్లో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. మధ్యప్రదేశ్ లోని అన్ని పట్టణాలు, నగరాల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పేర్కొన్నారు.  పెద్ద నగరాల్లో కంటైన్మెంట్ జోన్లను పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలోని పెద్ద నగరాలైన ఇండోర్, భోపాల్ లో అత్యధికంగా కేసులు నమోదవుతుండటంతో అక్కడ కంటైన్మెంట్ జోన్లను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం మన దేశంలో రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతుండటంతో అన్ని రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి.

Related posts