telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏబీ వెంకటేశ్వరరావు కేసును విచారణ జరిపిన సుప్రీంకోర్టు…

సుప్రీంకోర్టు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై విచారణ జరిపింది. జస్టిస్ ఎఎం ఖన్‌విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనంలో ఈ విచారణ జరిగింది. ఏడాది నుంచి సస్పెన్షన్ పొడిగింపు పై సర్వీస్ నిబంధనలు చూపించాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. అఖిల భారత సర్వీసు నిబంధనల్లోని రూల్ 3లో 1-సీ కింద సస్పెన్షన్ పొడిగించామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. రివ్యూ కమిటీ నిర్ణయం ప్రకారం ఆరు నెలల తర్వాత సస్పెన్షన్ పొడింగించినట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఏబీ వెంకటేశ్వరరావుపై అవినీతి చార్జ్ లేదని.. రూల్ 3లోని 1-బీ ప్రకారం ఏడాది కంటే ఎక్కువ సస్పెన్షన్ ఉండటానికి వీళ్ళులేదు అని ఏబీ వెంకటేశ్వరరావు తరపు న్యాయవాది ఆదినారాయణరావు అన్నారు. మరి అలాంటప్పుడు సస్పెన్షన్ పొడిగించిన రివ్యూ కమిటీ ఆదేశాలను ఎందుకు సవాలు చేయలేదని ఏబీ వెంకటేశ్వరరావు తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సస్పెన్షన్ పొడిగిస్తూ రివ్యూ కమిటీ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేసేందుకు మూడు రోజుల గడువు కోరారు న్యాయవాది ఆదినారాయణరావు. మూడు రోజుల్లో సస్పెన్షన్ పొడిగింపు ఆదేశాలను సవాలు చేస్తూ అప్లికేషన్ వేసేందుకు ఏబీ వెంకటేశ్వరరావుకు అనుమతి ఇచ్చింది కోర్టు. ఏబీ వెంకటేశ్వరరావు వేసే అప్లికేషన్ పై ఆ తర్వాతి మూడు రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఇక తదుపరి విచారణ మార్చి 9కి వాయిదా వేసింది కోర్టు.

Related posts