యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రంగా ‘ఆదిపురుష్’ అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెరకెక్కనుంది. ‘చెడు మీద మంచి సాధించిన విజయం’ అనేది ట్యాగ్ లైన్. రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాని దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో టీ-సిరీస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి అభిమానులు పలు డిజైన్లతో ప్రభాస్ ఫొటోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా.. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ మరోటి వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ నటించబోతుందట. ఈ వార్త నిజమే అంటూ… బాలీవుడ్ మీడియా సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే. అయితే.. కాజోల్ గత కొంత కాలంగా రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. కాగా… కాజోల్ రఘవరన్ 2 లో నటించిన సంగతి తెలిసిందే..
previous post
next post