క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఛార్మీ కౌర్, కరణ్ జోహార్‌తో కలిసి పూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం తదితర భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘లైగర్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే విజయ్‌కి జోడీగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. కొంత మేరకు షూటింగ్ పూర్తయిన తర్వాత కరోనా వైరస్ ప్రభావంతో సినిమా షూటింగ్ ఆగింది. ముంబైలో కరోనా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. దీంతో దర్శక నిర్మాతలు ఈ షెడ్యూల్‌లో మిగిలిన భాగాన్ని హైదరాబాద్‌లో చిత్రీకరించాలనుకుంటున్నారని వార్తలు వినపడుతున్నాయి. హైదరాబాద్‌లో సెట్ వేసి చిత్రీకరించాలనుకుంటున్నారట. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోయే ఈ సినిమా నిర్మాణంలో పూరి, ఛార్మిలతో పాటు కరణ్ జోహార్ కూడా భాగమై ఉన్నారు.
previous post
next post