కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో ఇళ్లకే పరిమితం అవుతున్న ప్రముఖులంతా సామాజిక మాధ్యమాల్లో వెరైటీ వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ‘బుట్ట బొమ్మ’ పాటకు స్టెప్పులేసి అదరగొట్టిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తాజాగా మరో సౌతిండియా పాటకు అదిరిపోయే హావభావాలతో కూడిన స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపర్చారు. ఆయన డ్యాన్స్‌కు అభిమానులే కాదు.. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా ఫిదా అయిపోయారు. పీటర్సన్ చేసిన “కొంటెగాణ్ణి పట్టుకో… (ఒట్టగత్తి కట్టికో)” పాటను ఏఆర్ రెహమాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘జెంటిల్‌మ్యాన్’ సినిమాలో ఈ పాట ఉంటుంది. ఆ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram