శీతాకాలంలో భారత రాష్ట్రపతి హైదరాబాదులో కొన్ని రోజుల పాటు విడిది చేయడం తెలిసిందే. ఈ ఏడాది కూడా రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం ఈ నెల 20వ తేదీన రాష్ట్రపతి కోవింద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వచ్చారు. నిన్న సాయంత్రం తన నివాసంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించిన రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిదిని ముగించుకున్నారు.
ఈ రోజు ఉదయం ఆయన హకీంపేట ఎయిర్‌ఫోర్స్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. రామ్‌నాథ్ కోవింద్‌కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్, మంత్రులు, మేయర్ బొంతు రామ్మోహన్‌లు వీడ్కోలు పలికారు.