telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విడుదలకు సిద్దమైన .. తేజ, కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రం ‘సీత’..

Sita

తేజ దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్రధారిగా ‘సీత’ రూపొందింది. కాజల్ జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి ‘యు’ సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సోనూ సూద్ నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో తేజ మాట్లాడుతూ, ఈ పాత్ర తానే చేస్తానని కాజల్ పట్టుబట్టినట్టుగా చెప్పారు. ఈ పాత్ర ఆమె కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోవడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ సినిమాపై మరింతగా అంచనాలు రోజురోజుకు పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి. బెల్లంకొండ శ్రీనివాస్‌కికూడా ఏమాత్రం హెల్ప్ అవుతుందో. కనీసం కాజల్ అయినా తనకు లక్కీ గర్ల్ అవుతుందో లేదో వేచి చూడాలి. నటన, అందం ఉన్నా ఎందుకో గాని బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఒక్క హిట్‌కూడా లేదు. మళ్ళీ అంతా పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్‌తోనే నటిస్తున్నారు. కనీసం చందమామ అయినా హిట్ ఇవ్వాలని కోరుకుందాం.

Related posts