telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాకు పోటీ ఇచ్చే వ్యక్తి ఇతనే… సోనూసూద్ పోస్ట్ వైరల్

Sonu-Sood

కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాక్ డౌన్ సమయంలో ఉపాధి లేక అల్లాడిపోతున్న వలస కూలీలకు అన్నంపెట్టి ఆదుకోవడమే గాక సొంత బస్సుల్లో వారి వారి గ్రామాలకు చేర్చారు. కొన్ని వేల మంది వలస కూలీలను వారి వారి సొంత గూటికి చేర్చిన ఆయన పేదోడి దేవుడయ్యాడు. లాక్ డౌన్ సమయంలోనే కాదు ఇప్పటికీ ఎవరికీ ఏ సమస్య వచ్చిన ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాడు. అలాంటి సోనూసూద్‌.. ‘నాకు కాంపిటేషన్ అతనే’ అని పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

 

View this post on Instagram

 

Happy birthday my hero❤️ @eshaansoood . Finally I have someone who’s going to give me competition in fitness 😂

A post shared by Sonu Sood (@sonu_sood) on

సోనూసూద్‌ కుమారుడు ఇషాన్‌ సూద్‌ బర్త్‌డే నేడు (సెప్టెంబర్‌ 19). ఈ సందర్భంగా సోనూసూద్‌ తన కుమారుడికి శుభాకాంక్షలు తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ పోస్ట్ చేశారు. ”నా హీరో ఇషాన్ సూద్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఫైనల్‌గా నాకు ఫిట్‌నెస్ విషయంలో పోటీ ఇచ్చే వ్యక్తి ఉన్నాడు.” అని తెలుపుతూ.. సేమ్‌ టు సేమ్‌ డ్రస్సు వేసుకుని బాడీని ఎక్స్‌పోజ్ చేస్తున్న పిక్‌ను సోనూ పోస్ట్ చేశారు. ఇషాన్ చిన్నప్పటి ఫొటో ఇది. ఈ పిక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే నెటిజన్లు అందరూ ఇషాన్ సూద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

Twinning 💪 @eshaansoood

A post shared by Sonu Sood (@sonu_sood) on

Related posts