telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-4 : ఈ వారం డబుల్ ఎలిమినేషన్

Bigg-Boss-4

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్-4 పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది అనే టాక్ నడుస్తోంది. ఆర్భాటంగా ప్రారంభమైన ఈ షో ఇప్పుడిప్పుడే ఆస‌క్తిక‌రంగా మారుతోంది. హౌస్‌లో క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి తొలిసారి అడుగు పెట్టిన లాస్యే మొద‌టి కెప్టెన్‌గా నిలిచింది. త‌ర్వాత నోయ‌ల్ ఈ వారం వెళ్లిపోతానంటూనే రెండో కెప్టెన్‌గా ఎన్నిక‌య్యాడు. అంతో ఇంతో పాపులారిటీతో హౌస్‌లో అడుగుపెట్టిన‌ కంటెస్టెంట్లు వీరిద్ద‌రు మాత్ర‌మే. దీంతో బిగ్‌బాస్ యాజ‌మాన్యం కూడా వీరికి బాగానే ముట్ట‌జెప్పింది. ఇదిలా వుంటే రెండో వారంలో క‌మెడియ‌న్ ముక్కు అవినాష్‌ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే అత‌డిని హౌస్‌లోకి ర‌ప్పించేందుకు బిగ్‌బాస్ యాజ‌మాన్యం బాగానే డ‌బ్బులు గుమ్మ‌రించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఒక వారం ఎలిమినేషన్ పూర్తవగా… మొదటివారం సూర్యకిరణ్ ను ఎలిమినేట్ చేశారు. కానీ రెండో వారానికి వ‌చ్చేస‌రికి మాత్రం ఎవ‌రు వెళ్లిపోతార‌నేది ఉత్కంఠ‌గా మారింది. ఈ వారం 9 మంది నామినేట్ అయ్యారు. ఈ విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే ఈ వారానికి గానూ అభిజిత్‌, గంగ‌వ్వ‌, నోయ‌ల్‌, హారిక‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, సోహైల్‌, క‌ళ్యాణి, కుమార్ సాయి, మోనాల్ ఇలా తొమ్మిది మంది ఇంటి స‌భ్యులు నామినేట్ అయ్యారు. పైగా ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌న్ కూడా ఉండొచ్చ‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Related posts