telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆ నలుగురు స్త్రీలను.. మరువకు..!!

నవమాసాలు మోసి

పురిటి నొప్పులతో మరో జన్మ పొంది

కంటికి రెప్పలా కాపాడుతూ

కలకాలం సుఖం కోరుకునేదే.. #అమ్మా

 

నీతో పాటే జన్మించి

అమ్మ పాలను భాగం పంచుకొని

ఆత్మీయతకు అనురాగానికి తోడుగా

ఇంటి గౌరవం కోసం ఎదురు చూసేది.. #సోదరి

 

నీ కోసం ఎక్కడో పుట్టి

నీ ఇంటికి మెట్టి

పురుషార్ధానికి కారణమయ్యే

కడవరకు నీతోనే కలిసి ఉండే.. #భార్య

 

నీకు పుట్టిన బిడ్డ

నీ ఇంటి మహాలక్ష్మి

అమ్మ ప్రేమను ఆమెకు పంచితే

అపురూపంగా చూసుకునేది.. #కూతురు

 

ఈ నలుగురు సంతోషమే

ప్రతి ఇంటికి సౌభాగ్యము

వారి కంటనీరు ఒలికితే

ఆ కుటుంబానికి అరిష్టము..#తెలుసుకో…

 

Related posts