telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పరాన్నజీవి” టైటిల్ సాంగ్ రిలీజ్

Parannajivi

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ అనే సినిమా రూపొందిస్తుండటంతో పీకే ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వర్మను ఇప్పటికే బూతులు తిడుతున్నారు. ఇలాంటి సమయంలో కొంత మంది పవన్ కళ్యాణ్ అభిమానులు ‘పరాన్నజీవి’ అనే సినిమాతో వర్మపై రివేంజ్ తీసుకోవడానికి వస్తున్నారు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ఈ సినిమాను ఈనెల 25న ఉదయం 11 గంటలకు శ్రేయాస్ ఈటీ ఏటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల చేస్తున్నారు. సరిగ్గా ఆర్జీవీ ‘పవర్ స్టార్’ సినిమాను విడుదల చేస్తోన్న తేదీకే ‘పరాన్నజీవి’ని విడుదల చేస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను విడుదల చేశారు. ‘‘జీవి జీవి ఇది పరాన్న జీవి.. నీతిలేని ఓ నిశీధి జీవి. జీవీ నిర్జీవి – అతడే ఆర్జీవి. పచ్చి నెత్తురు మరిగిన జీవి.. పచ్చి బూతులు మొరిగే జీవి. చచ్చిన వాడిని వదలని జీవి.. బతికున్నోడిని చంపే జీవి. ఉచ్చం నీచం ఎరుగని జీవి.. వృత్తిని తార్చే వికృత జీవి’’ అంటూ కఠినమైన పదాలతో వర్మపై తమ రివేంజ్‌ను తీర్చుకున్నారు. వర్మ స్టైల్లోనే పాటను డిజైన్ చేశారు. ‘తల్లీ చెల్లీ తేడా లేదు సర్వం నికృష్టం’ అంటూ విరుచుకుపడ్డారు. ఈ సినిమాను 99 థియేటర్ బ్యానర్‌పై సీఎస్ నిర్మిస్తున్నారు. ‘బిగ్ బాస్’ ఫేమ్ డాక్టర్ నూతన్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని.

Related posts