telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ ముగ్గురు ఫ్యాన్స్‌ నుండి వర్మకు రక్షణగా కుక్కలు

varma

రాంగోపాల్ వర్మ తన ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నాడట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ కుక్కతో పాటు దిగిన ఫొటోని షేర్ చేశాడు. వర్మకు ఈ కుక్కలపై ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చింది అంటే.. అందులోనూ మనోడి స్వార్థం ఉంది. దాన్ని మొహమాటం లేకుండా చెప్పేశాడు. కొందరు అభిమానుల నుండి తనకు రక్షణగా రెండు కుక్కలను తెచ్చుకున్నా.. అంటూ ఎవరయ్యా ఆ అభిమానులు అంటే పీకేఎఫ్, సీబీఎన్ఎఫ్, ఎల్ బీ ఎఫ్.. అని పేర్లు ఇచ్చాడు. ఇందులో ఎఫ్ అంటే ఏంటో మీరే చెప్పండని ఫజిల్ ఇచ్చాడు వర్మ. సరే ఈ ట్వీట్‌లో మనకు అర్థమైనంతవరకూ పీకేఎఫ్ అంటే.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని, సీబీఎఫ్ అంటే చంద్రబాబు ఫ్యాన్స్ అని, ఎల్ బీ ఎఫ్ అంటే లోకేష్ బాబు ఫ్యాన్స్ అని అనుకుందాం. మరి ఈ ముగ్గురు ఫ్యాన్స్‌ నుండి వర్మను ఆ కుక్కలు ఎంతవరకూ రక్షణగా నిలుస్తాయో చూడాలి.

Related posts