telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఆగస్టు 5 వరకు తిరుపతిలో లాక్‌డౌన్‌

tirumala temple

తిరుపతిలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కేసుల తీవ్రత దృష్ట్యా అధికారులు లాక్‌డౌన్‌ ప్రకటించారు. నేటి నుంచి ఆగస్టు 5వ తేది వరకు నిబంధనలు అమల్లో ఉంటాయి. ఈ మేరకు తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయంలో నిన్న కలెక్టర్‌ భరత్‌గుప్తా మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో 50 వార్డుల్లోనూ 20 కేసులు దాటాయని, కొన్నింట్లో 40 కూడా ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు. నగరమంతా కంటైన్‌మెంట్‌ జోన్‌గా మారిందన్నారు.అన్ని వ్యాపారాలు ఉదయం 11 గంటలకే అనుమతి ఉంటుందన్నారు.

వైద్య అవసరాల కోసం ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు, పాల కేంద్రాలు ఉంటాయన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు, బ్యాంకుల సహా అన్నింటినీ మూత వేయాల్సిం దేనన్నారు. ఈ నెలాఖరున పరిస్థితిపై సమీక్షించి మరోసారి నిర్ణయం ఉంటుందని తెలిపారు. జిల్లాలో రోజుకు సగటు 2.3 శాతం మరణాలు రికార్డు అవుతున్నాయని పేర్కొన్నారు. అర్బన్‌ ఎస్పీ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో 45 రోజులపాటు శ్రీకాళహస్తిలో పూర్తి లాక్‌డౌన్‌ విధించడం వల్ల పూర్తి సత్ఫలితాలు వచ్చాయని తెలిపారు.

Related posts