ఇక నుండి నగరంలో హోటల్స్, రెస్టారెంట్లు అర్ధరాత్రి 12 గంటల వరకు పని చేయనున్నాయి. పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావును హోటల్ యజమానుల సంఘం సభ్యులు కలిశారు. రాత్రి 10.30 వరకు మాత్రమే హోటల్స్‌కు అనుమతి ఉన్నందున వ్యాపారంలో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయా వ్యాపార యజమానులు 15-10-2018 జారీ చేసిన జీవో ప్రకారం 12 గంటల వరకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సీపీ ద్వారకా తిరుమలరావు… నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లకు రాత్రి 12 గంటల వరకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.