telugu navyamedia
సినిమా వార్తలు

డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు సమన్లు

నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు సినీ ప్రముఖులను ఈడీ సమన్లు జారీచేసింది. ఛార్మి, రకుల్‌ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రానా, రవితేజ, పూరీ జగన్నాథ్‌, నవదీప్‌, ముమైత్‌ ఖాన్‌, తరుణ్‌, నందు విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 31 నుంచి సెప్టెంబరు 22 వరకు డ్రగ్స్ ఆరోపణలపై ఈడీ విచారించనుంది. 2017లో నమోదైన డ్రగ్స్ కేసులో పలువురు సినీ ప్రముఖులను ఎక్సైజ్ అధికారులు సుదీర్ఘ విచారణ జరిపారు. రక్తం, గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపారు. ఆ తర్వాత ఈ కేసు విచారణ వేగవంతం తగ్గింది.

 

ఈ నేపథ్యంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. డ్రగ్స్‌ కేసును సీబీఐ, ఎన్‌సీబీ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని గతంలో రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఫోరమ్ ఫర్ గుడ్ గవెర్నెన్స్ సీబీఐ అధికారులకు, ఈడీ అధికారులకు ఒక లేఖను రాసింది. కేసు విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎక్సైజ్‌ అధికారుల నుంచి వివరాలు అందడం లేదని ఈడీ ఆరోపించింది. చివరకు ఎక్సైజ్‌ శాఖ కేసుల ఆధారంగా డ్రగ్స్‌ కేసులపై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి రంగంలోకి
దిగింది. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో సినీ ప్రముఖులతో పాటు, డ్రగ్స్ విక్రేతలను ఈడీ బృందాలు ప్రశ్నించనున్నాయి.

Related posts