telugu navyamedia
సినిమా వార్తలు

నాగ చైతన్యలో “జోష్ ” ఏది ” ?

అక్కినేని నాగ చైతన్య మంచి జోష్ వున్న హీరో మాత్రమే కాదు వ్యక్తి కూడా . ఎప్పుడూ నవ్వుతూ , తుళ్ళుతూ ఉంటాడు .తాత అక్కినే నాగేశ్వరావు , తండ్రి నాగార్జున వారసత్వము తో సినిమా రంగంలోకి వచ్చినా నటుడుగా అతనిలో ప్రతిభ వుంది కాబట్టే దినదిన ప్రవర్ధమాన మవుతున్నాడు . విభిన్న పాత్రలను ధరిస్తూ తన సినిమా జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు .

Naga Chaitanya-Sai Pallavi starrer a typical love story: Director Shekar  Kammula | The News Minute

నాగ చైతన్య పేరులో మాత్రమే కాదు మనిషిలో కూడా చైతన్యం అణువణువులో కనిపిస్తుంది .
నాగ చైతన్య గురించి మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారంటే ” చైతు అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం . ఎప్పుడూ నవ్వుతూ కూల్ గా కనిపిస్తాడు . ఐతే కాదు తన సినిమా జీవితాన్ని చక్కగా ప్రణాళికా బద్దంగా తీర్చిదిద్దుకుంటున్నారు . సినిమా రంగంలో ఎక్కువ కాలం హీరోగా చైతు కొనసాగడానికి నిరంతరం కష్ట పడుతున్నాడు “. అంటూ కితాబిచ్చాడు .

Aamir Khan praises Naga Chaitanya, reveals why he attended Love Story  event: 'Something I wanted to tell his parents, fans…' | Entertainment  News,The Indian Express

బాలీవుడ్ సూపర్ స్టార్ , విలక్షణ నటుడు అమీర్ ఖాన్ తో కలసి నాగ చైతన్య ఓకే హిందీ చిత్రంలో నటించాడు . ఈ సినిమా షూటింగ్లో ఇద్దరూ నెల రోజులపాటు కలసి వున్నారు . నాగ చైతన్య అమీర్ ఖాన్ కు బాగా నచ్చాడు . అందుకే “లవ్” స్టోరీ ” సినిమాలో చిన్న ట్రైలర్ చూసిన అమీర్ ఖాన్ హైదరాబాద్ వచ్చాడు . నాగ చైతన్య , సాయి పల్లవి నటించిన “లవ్ స్టోరీ ” సినిమా విడుదలకు ముందు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నాడు నాగ చైతన్య తనకు ఎంత బాగా నచ్చాడో అమీర్ ఖాన్ వేదిక మీద చెప్పాడు.

Love Story Movie News Details | Latest and Upcoming Movie Information

ఇక “లవ్ స్టోరీ ” చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల చైతు నిరాడంబరత , నటన పట్ల వుండే అంకితభావం గురించి చెప్పాడు . అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన చైతన్యలో కించిత్ కూడా గర్వం లేదని కితాబిచ్చాడు .
హీరోయిన్ సాయి పల్లవి కూడా చైతు సహకారం మర్చిపోలేనిది చెప్పింది . దర్శకుడు చెప్పినట్టుగా షాట్ రావడానికి ఎన్ని టేకులైనా చేస్తాడని , రాజీ పడే మనస్తత్వం కాదని పేర్కొన్నది.

Naga Chaitanya-Sai Pallavi's Love Story gets new release date - NEWS

“లవ్ స్టోరీ ‘ సినిమా థియేటర్లలో విడుదలవుతుంటే అందరిలో జోష్ కనిపిస్తుంది . నాగ చైతన్యలో మాత్రం అది కనిపించడం లేదు . ఎప్పుడూ ముఖంలో చిరు నవ్వు మెరుస్తూ ఉంటుంది , కళ్ళలో వెలుగు విరజిమ్ముతూ ఉంటుంది . కానీ చైతన్య మాత్రం చాలా గంభీరంగా కనిపిస్తున్నాడు . ఎప్పుడైనా నవ్వినా అందులో జీవం ఉండటం లేదు . మనసులో ఎదో బాధ , చెప్పలేని వ్యధ కనిపిస్తున్నాయి.

A look at Samantha Prabhu and Naga Chaitanya's beautiful love story

నాగ చైతన్య , సమంత ఇష్టపడి వివాహం చేసుకున్నారు . ఇద్దరూ కలసి సంతోషంగా వుంటున్నారు . ఐతే ఇటీవల వీరి వైవాహిక జీవితంపై సామాజిక మాధ్యమాల్లో పుకారులు షికారు చేస్తున్నాయి . చైతు , సామ్ విడిపోతున్నారనే వార్తలు రోజు వినిపిస్తూనే వున్నాయి . అయితే ఇద్దరూ ఈ వార్తలపై స్పందించడం లేదు .
“లవ్ స్టోరీ” సినిమా విడుదల సందర్భంగా అందరూ చైతూను అభినందిస్తుంటే . సమంత నుంచి ఒక చిన్న మెచ్చుకోలు మాట , అభినందన కూడా లేదు . ఈ గాలి వార్తలు , నీలి మాటలు నిజమేనేమో అన్నట్టు చైతన్య ముఖంలో నవ్వు మాయమైపోయింది . ఏమాత్రం జోష్ లేదు . ఎంతో గంభీరంగా కనిపిస్తున్నాడు .
ఈ ఇద్దరి వైవాహిక జీవితానికి .నిజంగానే తెర పడిపోతుందా ?

Celebrities wish Naga Chaitanya, Samantha a lifetime of happiness - The  Statesman

Related posts