telugu navyamedia
తెలంగాణ వార్తలు విద్యా వార్తలు

తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ లింబాద్రి ఈ ఫలితాలను కొద్ది సేపటి క్రితం వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో విడుదల చేశారు. ఐసెట్‌ ఫలితాల్లో 90.09 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత సాధించారు.

ర్యాంకు సాధించిన వారు..
హైదరాబాద్ కు చెందిన లోకేశ్ మెుదటి ర్యాంకు సాధించ‌గా.. సాయి తనూజ రెండో ర్యాంకు సాధించారు. నవీనక్షంత (మేడ్చల్‌) మూడో ర్యాంకు, రాజశేఖర చక్రవర్తి (మేడ్చల్‌) నాలుగో ర్యాంకు సాధించారు. మొద‌టి 10 ర్యాంకుల్లో తెలంగాణ‌కు చెందిన 10 మంది ఉండ‌గా..కృష్ణా జిల్లాకు చెందిన ఆనంద్‌పాల్ ఐదో ర్యాంకు సాధించాడు.

తెలంగాణ, ఏపీ నుంచి 56,962 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 200 మార్కులకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలో 25 శాతం మార్కులు సాధిస్తే అర్హత సాధించినట్లుగా గుర్తిస్తారు. ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ icet.tsche.ac.inను చూడవచ్చు.

Related posts