ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..నమ్మక ద్రోహానికి ప్రతిరూపం చంద్రబాబు అని దుయ్యబట్టారు. అంత నమ్మక ద్రోహి, కుల పిచ్చి ఉన్న నాయకున్ని తాను చూడలేదని ఎర్రబెల్లి అన్నారు.
చంద్రబాబు నాయుడిని అప్పుడే టీడీపీలోకి తీసుకోవద్దని ఎన్టీఆర్‌కు చెప్పామని గుర్తుచేశారు. తమ అభిమాన నేత ఎన్టీఆర్‌ను వెన్నపోటు పొడిచి సీఎం అయ్యారని ఆరోపించారు. అబద్ధాలకు, నయవంచనకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ది చెప్పాలని కోరారు.
వాలంటీర్ల అరాచాకాలు ముఖ్యమంత్రికి కనిపించటం లేదా? – బండారు శ్రావణి