telugu navyamedia
తెలంగాణ వార్తలు

బీజేపీ కార్య‌క‌ర్త‌లు త‌ల‌లు ప‌గ‌లుగొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు..

*డీజీపీకి బండి సంజ‌య్ వార్నింగ్‌
*బీజేపీ కార్య‌క‌ర్త‌లు త‌ల‌లు ప‌గ‌లుగొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు..

జ‌న‌గామా జిల్లా దేవరుప్పులలో జరిగిన‌ రాళ్లదాడిపై తీవ్రంగా స్పందించిన బండి సంజయ్ పోలీసుల‌పై ఆగ్ర‌హంవ్య‌క్తం చేశారు. బీజేపీ కార్యకర్తల తలలు పగలగొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని డీజీపీతో నేరుగా ఫోన్ లో మాట్లాడారు

పోలీసులకు జీతాలు కేసీఆర్ జేబుల్లోంచి ఇస్తున్నారా? అంటూ బండి సంజయ్ నిలదీశారు. కేసీఆర్ ఉండేది ఇంకో 6 నెలలే అన్నారు. తక్షణమే పాదయాత్ర సాఫీగా సాగేలాచర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని బండి సంజయ్ కోరారు. లేదంటే జరగబోయే పరిణామాలకు పోలీసులదే బాధ్యత అని హెచ్చరించారు.

పోలీస్ సెక్యూరిటీని నిరాకరించిన బండి సంజయ్ తన భద్రతను మా కార్యకర్తలే చూసుకుంటారని బండి సంజయ్ స్పష్టం చేశారు

కాగా…దేవరుప్పలలో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్‌ మాట్లాడుతూ..  నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎవరికీ సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని  విమర్శలు చేశారు. అదే సమయంలో అక్కడ ఉన్న కొంతమంది టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బండి సంజయ్ వ్యాఖ్యలతో విభేదించారు. వారు బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. గట్టిగా నినాదాలు చేస్తూ బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

దీంతో టీఆర్‌ఎస్‌,  బీజేపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ తోపులాటకు దారి తీసింది. ఒక వర్గంపై మరో వర్గం రాళ్ల దాడి కూడా చేసుకున్నారు. ఈ ఘర్షణలో కొంత మంది బీజేపీ, టీఆర్ఎస్ నేతలకు గాయాలయ్యాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. చివరికి వారిని అదుపు చేశారు.   వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు.

Related posts