telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మానవ హక్కుల న్యాయస్థానాల ఏర్పాటు పై .. 7 రాష్ట్రాలకు కోర్ట్ లక్ష జరిమానా …

supreme court collegium to ap and telangana

సుప్రీం కోర్టు ప్రతి రాష్ట్రంలోనూ మానవ హక్కుల న్యాయస్థానం ఏర్పాటు చేయాలనే అంశంపై అన్ని రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని 2018 జనవరి 4న ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించని 7 రాష్ట్రాలకు సర్వోన్నత న్యాయస్థానం రూ.లక్ష వరకు జరిమానా విధించింది. మానవ హక్కుల న్యాయస్థానాల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్​ ప్రాసిక్యూటర్ల​ నియామకంపై నేడు సుప్రీం ధర్మాసనం విచారించింది. ఏఏ రాష్ట్రాలు ఈ అంశంపై తమ స్పందనలు తెలియజేయలేదని సుప్రీం ప్రశ్నించింది. 7 రాష్ట్రాలు తమ అభిప్రాయాలు చెప్పకపోవడంతో ధర్మాసనం ఈ మేరకు చర్యలు చేపట్టింది.

కేసు విషయంలో అలసత్వం చూపించడం..కనీసం విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాాదుల హాజరుకాని పక్షంలో రాజస్థాన్​, ఉత్తరాఖండ్​ రాష్ట్రాలకు రూ. లక్ష జరిమానా పడింది. తెలంగాణ, ఉత్తర్​ప్రదేశ్, ఒడిశా, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలకు తలా రూ. 50 వేలు జరిమానా విధించింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ 7 రాష్ట్రాలు తమ అభిప్రాయాలను 4 వారాల లోపు సమర్పించాలని ఆదేశించింది. విచారణను 6 వారాలు వాయిదా వేసింది.

Related posts