telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణ చీఫ్ జస్టిస్ రాథాకృష్ణన్ ఆకస్మిక బదిలీ

supreme court two children petition
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ టీబీ రాథాకృష్ణన్ ను ఆకస్మికంగా బదిలీ  బదిలీ అయ్యారు. చేస్తూ సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసు చేసింది. కోల్ కతా హైకోర్టు చీఫ్ జిస్టిస్ గా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈమేరకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా హైకోర్టు చీఫ్ జస్టిస్ డీకే గుప్తా డిసెంబరు 31వతేదీన పదవీ విరమణ చేయడంతో ఖాళీ ఏర్పడింది. దీంతో కోల్ కతా చీఫ్ జస్టిస్ గా రాథాకృష్ణన్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టుకు చెందిన కొలిజియం జడ్జీలు జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ సిక్రీ, జస్టిస్ బొబ్డే, జస్టిస్ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రాలు ఈ నెల 10వతేదీన సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. 
తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన జనవరి 1వ తేదీన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేశారు. పదిరోజుల్లోనే చీఫ్ జస్టిస్ రాథాకృష్ణన్ ను కోల్ కతాకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీనియారిటీలో రెండు స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు రాథాకృష్ణన్ గత ఏడాది జులై నుంచి ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గా వ్యవహరించారు.

Related posts