మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ రోజు కరీంనగర్ జిల్లాలోని పలు డివిజన్లలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకుని టీఆర్ఎస్ కే ఓటేయాలని సూచించారు. ఎన్నికల్లో పంచే డబ్బులు మనవే అని చెప్పారు.
డబ్బులను కాదనకుండా తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. పోటీచేస్తున్న నాయకులను పిలిచి.. ఓటుకు రెండు వేలు అడిగి తీసుకోవాలని ఓటర్లను గంగుల కోరారు. భూదందాలతో డబ్బులు దండుకున్న వారు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.