తాను మైనర్ అని నిర్భయ దోషి పవన్ గుప్తా వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టుకొట్టివేసింది. దీంతో ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్షను అమలు చేయబోతున్నారు. పవన్ గుప్తా వేసిన పిటిషన్ ను జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్న నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
పవన్ గుప్తా వేసిన పిటిషన్ లో పరిశీలించాల్సిన అంశాలేవీ ఇందులో తమకు కనిపించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఐతే పవన్ గుప్తా మైనర్ కాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కాలయాపన కోసమే పిటిషన్ వేశారని కోర్టు పేర్కొంది. ఒకే అంశంపై మళ్లీ మళ్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.