telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ప్రతి రోజూ ఎండలో 15 నిమిషాలు ఉంటే కరోనాకు చెక్!

రోజూ కనీసం ఓ పదిహేను నిమిషాలపాటు ఉదయపు నీరెండలో నిలబడో కూర్చునో లేదా కాసేపు వ్యాయామమో చేస్తే ఎవరికి వాళ్లు ఎంతో మేలు చేసుకున్నట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఎండ కారణంగా చర్మంపై పొరల్లోని నైట్రిక్‌ ఆక్సైడ్‌ చురుగ్గా మారి రక్తనాళాలను వెడల్పుగా చేస్తుంది. దాంతో రక్తప్రసరణ మెరుగై బీపీ తగ్గడానికి అవకాశం ఉంటుంది.

నిద్రలేమితో బాధపడేవాళ్లయితే కాసేపు ఎండలో ఉంటే వాళ్లలో నిద్రకు కారణమయ్యే మెలటోనిన్‌ స్రావం పెరుగుతుంది. సూర్యకిరణాలు చర్మానికి హానికరం అని భావిస్తారు. కానీ ఉదయపు ఎండలోని కిరణాలు సొరియాసిస్‌ వంటి వ్యాధుల్నీ తగ్గిస్తాయి.

విటమిన్‌-డి కేవలం ఎముకలకే కాదు, ఇన్సులిన్‌ స్రావాన్నీ పెంచడం ద్వారా మధుమేహం రాకుండా కాపాడుతుంది. కంటి ఆరోగ్యాన్నీ పెంచుతుంది. కండరాల ఆరోగ్యానికీ ఆలోచనాశక్తికీ సూర్యరశ్మి దోహదపడుతుంది. ఆల్జీమర్స్‌ రోగుల్ని కాసేపు ఎండలో కూర్చోపెట్టడం వల్ల వాళ్లలో డిప్రెషన్‌, మతిమరుపు కొంతవరకూ తగ్గినట్లు అమెరికన్‌ మెడికల్‌ అసోసియేన్‌ పేర్కొంటోంది.

* చలికాలంలో వచ్చే సీజనల్‌ డిజార్డర్లనీ డిప్రెషన్‌ వంటివాటినీ తగ్గించే శక్తి కూడా సూర్యరశ్మికి ఉంది. మొత్తంగా రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అందుకేనేమో ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం ఎంతో మంచిది అంటారు పెద్దవాళ్లు.

మరీ ముఖ్యంగా ఎండలో ప్రతీ రోజు నిల్చుంటే… రోగానిరోధక శక్తి పెరిగి.. కరోనాను సమర్థ వంతంగా ఎదురుకొంటాం 

Related posts