telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రతి జిల్లాలో మానవ అక్రమ రవాణా వ్యతిరేక కేంద్రాలు .. అంతా మహిళల రక్షణ కోసమేనట..

smruti irani supports dhoni in semis play

కేంద్రం దేశంలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం మారో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో మానవ అక్రమ రవాణా వ్యతిరేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ శనివారం వెల్లడించారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దేశంలోని పోలీస్‌ స్టేషన్లలో మహిళల కోసం సహాయ కేంద్రాలను కూడా నెలకొల్పనున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యకలాపాలకు ‘నిర్భయ నిధి’ నుంచి ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు మహిళ భద్రతను మరింత బలోపేతం చేస్తాయని, వారిలో భద్రతా భావాన్ని ఇనుమడింప జేస్తాయని స్మృతి అన్నారు. తమ శాఖ సూచించిన అంశాలను అంగీకరించిన కేంద్ర హోంమంత్రిత్వశాఖ, అమిత్‌ షాకు స్మృతి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళలు, చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. 2012 డిసెంబర్‌ 16న దిల్లీలో నిర్భయపై జరిగిన అత్యాచారం, హత్యోదంతం దేశంలో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దారుణకాండను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. మహిళల భద్రతకు కఠిన చట్టాలు తీసుకురావాలని నినదించారు. దీంతో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని కఠిన శిక్షలు విధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకొచ్చింది. 2013లో నిర్భయ పేరిట ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేసింది.

Related posts