*ఉక్రెయిన్ వైపు అమెరికా యుద్దవిమానాలు మొహరింపు..
*రష్యాపై ప్రతిచర్యకు సిద్ధమవుతున్న అమెరికా..
*రష్యా దాడుల వల్ల జరిగే విధ్వంసం, ప్రాణనష్టానికి ఆ దేశానిదే పూర్తి బాధ్యత
ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ మొదలైందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటనపై యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించింది. ఉక్రెయిన్‌పై రష్యా అన్యాయంగా దాడి చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
రష్యా దాడుల వల్ల జరిగే విధ్వంసం, ప్రాణనష్టానికి ఆ దేశానిదే పూర్తి బాధ్యత అని పేర్కొంది. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని రష్యా ఉల్లంఘించిందని.. రష్యా సైనిక చర్యను ఆపాలని, బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని ఆయన పేర్కొన్నారు.
రష్యా యుద్ధాన్ని కోరుకుందని.. రష్యా దాడులకు ప్రతి చర్య తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.
ఈ అంశంపై అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి ఐకమత్యంతో దీనిపై నిర్ణయాత్మకంగా స్పందిస్తుందని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. రష్యాను ప్రపంచం బాధ్యుల్ని చేస్తుందని స్పష్టం చేశారు.
కాగా..ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన కొద్దిసేపటికే అమెరికా అధ్యక్షుడు బిడెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో మాట్లాడినట్లు వైట్ హౌస్ తెలిపింది. దీనికి సంబంధించి త్వరలో మిత్ర దేశాలతో సమావేశం నిర్వహించనున్నట్టు కూడా చెప్పారు.