telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

పోస్టాఫీసులలో రైల్వే రిజర్వేషన్ టికెట్లు

post office

ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఆత్యవసర ప్రయాణం కోసం తత్కాల్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చిన రైల్వే శాఖ ఆయా రిజర్వేషన్ టికెట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు బహిరంగ మార్కెట్‌లలో కౌంటర్‌లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధారణ ప్రయాణికులకు ఈ ఆన్‌లైన్ రిజర్వేషన్ టికెట్లు అందుబాటులోకి తెచ్చేందుకు స్థానికంగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే పోస్టాఫీసులలో ఈ రిజర్వేషన్ కౌంటర్‌లను ఏర్పాటు చేస్తోంది. రైల్వే శాఖ టికెట్ రిజర్వేషన్ సేవలను విస్తృతం చేస్తూ స్థానిక పోస్టాఫీస్‌లలో వీటిని ఏర్పాటు చేస్తుండడంతో ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పోస్టాఫీసులలో ప్రయాణికులు సాధారణ టికెట్లు 120 రోజుల ముందుగా , తత్కాల్ టికెట్లు 24 గంటల ముందుగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తత్కాల్ లో ఏసీ రిజర్వేషన్‌ను ఉదయం 10 గంటల నుంచి ప్రారంభించి , తత్కాల్ స్లీపర్ రిజ ర్వేషన్‌లను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇస్తున్నామని , జనరల్ టికెట్లు నాలుగు నెలల ముందు ఎప్పుడైనా తీసుకోవచ్చని పోస్టల్ అధికారులు తెలిపారు.

Related posts