telugu navyamedia
క్రీడలు వార్తలు

కృనల్ అసలు బౌలర్ లానే కనిపించలేదు : గవాస్కర్

ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. బెయిర్‌స్టో, స్టోక్స్‌ ధాటికి అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యాలు. మ్యాచ్‌లో 6 ఓవర్లు వేసిన కృనాల్.. ఏకంగా 72 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్.. కృనాల్ పాండ్యాపై అసహనం వ్యక్తం చేశాడు. ‘కృనాల్ పాండ్యా జట్టు‌లో ఐదో బౌలర్‌గా నాకు ఏమాత్రం కనిపించలేదు. రెండో వన్డేలో అతని కారణంగానే టీమిండియా బౌలింగ్ విభాగం బలహీనమైంది. మ్యాచ్‌లో కృనాల్ తన కోటా 10 ఓవర్లని కూడా వేయలేకపోయాడు. కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా ఇద్దరూ కలిసి 10 ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఉంది. కానీ అదీ జరగలేదు’ అని సన్నీ అన్నారు. చివరి వన్డేకి నాలుగు, ఐదో బౌలర్‌ గురించి టీమిండియా కచ్చితంగా పునరాలోచిస్తే మంచిది. రెండో వన్డేలో బెన్‌ స్టోక్స్, జానీ బెయిర్‌స్టోని భారత స్పిన్నర్లు ఎలాంటి ఇబ్బందులు పెట్టలేకపోయారు. ఒకవేళ టీమ్‌లో రవీంద్ర జడేజా లేదా యుజ్వేంద్ర చహల్ లాంటి బౌలర్లు ఉండింటే.. ఫలితం భిన్నంగా ఉండేది’ అని భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.‌

Related posts