telugu navyamedia
తెలంగాణ వార్తలు

సర్వజన సమ్మేళనమే హిందుత్వం..

వివిధ కులాలు, వర్గాల ప్రజలు కలిస్తేనే హిందుత్వం అవుతుంది కానీ.. అది ఒక కులానికి మతనికో సంబంధించి కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ ఛాలక్ ( జాతీయ ప్రధాన కార్యదర్శి) అన్నారు… దీన్ని కొంత మంది రాజకీయం చేస్తున్నారనీ.. కులాల పేరుతో విభజిస్తే సెక్యులరిజం అంటున్నారని అన్నారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (హిందూ శక్తి సంగమం) జిల్లా మహా సాంఘిక్ సార్వజనిక ఉత్సవం నల్లగొండలో ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి (సర్ కార్యవాహా) దత్తాత్రేయ హోసబలే నల్లగొండ జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంలో వారికి స్వాగత సూచకంగా పట్టానంలోని 3ప్రధాన వీధుల గుండా పదసంచలన నిర్వహించారు… 3మార్గాలలో వచ్చిన ర్యాలీలు క్లాక్ టవర్ సెంటర్లో కలిసి క్లాక్ టవర్ సెంటర్ మీదుగా ఎన్జీ కళాశాల చేరుకున్నాయి… అక్కడ జరిగిన కార్యక్రమంలో సార్వజనిక ఉత్సవం నిర్వహించారు….

ఈ కార్య‌క్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ కస్తూరి చందు పాల్గొన్నారు… ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్నా దత్తాత్రేయ హోసబలే మాట్లాడుతూ… భారత్ గొప్ప శక్తిగా ఎదిగి ప్రపంచంలోనే గొప్ప శక్తిగా ఎదిగింది అని అన్నారు…. కానీ సాధించాల్సిన అభివృద్ది మాత్రం జరగలేదన్నారు… జపాన్, ఇజ్రాయెల్ మనకన్నా చిన్నా దేశాలు, అణచివేతకు గురైన దేశాలు అయినప్పటికీ మనముందు ఎంతో ప్రగతి సాధించాయనీ… ఇదంతా అక్కడి ప్రజల స్వాభిమానం తోనే సాధ్యమైంది అన్నారు.

మొదటి నుంచి మన విద్యా వ్యవస్థ, సంస్కృతి సంప్రదాయాలను మరుగున పరచడం ద్వారా దేశం వునుకబాటుకు గురైందన్నారు…. భారత దేశ ప్రాచీన యోగ ఇప్పుడు ప్రపంచం ఆదరిస్తుంది .. అలాగే కొవిడ్ వ్యాక్సిన్, రామమందిరం నిర్మాణం.. ఇవన్నీ కూడా స్వాభిమానం తోనే సాధ్యమయ్యయని అన్నారు… మన దేశంలో కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయనీ… అలాంటి సమయంలో హిందూ సమాజం జాగృతం చేసేందుకు ఆరెస్సెస్ నడుం బిగించింది అని అన్నారు

Related posts