telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

పబ్బులకు తిప్పినందుకే డ్రైవర్ కు కోట్ల ఆస్తి రాసిచ్చాడు…!?

Cabbie

బ్రిటన్‌కు చెందిన గ్యారీ మెండెజ్ అనే ఓ వ్యక్తికి మందు పిచ్చి బాగా ఎక్కువ. ప్రతిరోజూ ఒకదాని తర్వాత ఒకటి చొప్పున ఈస్ట్‌బౌర్న్ ప్రాంతంలోని పబ్బులకూ తిరుగుతుంటాడు. ఇలా తిప్పడానికి చాలా మంది డ్రైవర్లు విసుక్కోవడం మొదలెట్టారు. అదే సమయంలో డీన్ హూజెస్ అనే ఓ క్యాబ్ డ్రైవర్ అతనికి పరిచయం అయ్యాడు. గ్యారీ అడిగిన చోటకల్లా తీసుకెళ్లడం మొదలెట్టాడు. దీంతో వారిద్దరూ మంచి మిత్రులయ్యారు. దాంతో ఓ రోజు మద్యంతాగి తన ఇంటితో సహా ఆస్తి మొత్తాన్నిడీన్ పేరిట రాసేశాడు. కొన్ని రోజుల క్రితం గ్యారీ మరణించడంతో ఈ విషయం బయటపడింది. ఆస్తిని క్లెయిమ్ చేసిన డీన్‌పై గ్యారీ మాజీ ప్రియుడు రోడ్రిగెజ్ కోర్టుకెక్కాడు. తామిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఆ ఇంటిని గ్యారీ తనకు ఇచ్చాడని, తాము విడిపోయినా ఆ ఇల్లు మాత్రం తనకే చెందుతుందని రాసిచ్చాడని కోర్టుకు తెలిపాడు. రెండు వీలునామాలు పరిశీలించిన కోర్టు ఆ ఇంటిని డీన్‌కు ఇవ్వడానికి నిరాకరించింది. డీన్ ప్రవేశపెట్టిన విల్లును అంగీకరించడం కుదరదని తేల్చి, కోర్టు ఖర్చుల కింద రోడ్రిగెజ్‌కు 50 వేల యూరోలు(సుమారు రూ.40 లక్షలు) చెల్లించాలని డీన్‌ను ఆదేశించింది.

Related posts