telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ హీరోయిన్ తో ఎన్టీఆర్ రొమాన్స్ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 30వ సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు. అయితే ఓ వైపు ఎన్టీఆర్ తన ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నారు కాబట్టి.. త్రివిక్రమ్‌తో చేయబోయే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలుకానుందనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఎన్టీఆర్30లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనున్నట్లు ఇంతకుముందు వార్తలు విన్పించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం కియారా అద్వానీనే మేకర్స్ చివరకు ఓకే చేశారట. ఎన్‌టిఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ‘ఎన్టీఆర్30’ హీరోయిన్ పేరును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Related posts