టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేరు తెలియని వారుండరు. దూకుడు ఆట తీరు, ప్రత్యర్థి బౌలర్‌పై విరుచుకుపడే స్వభావం కోహ్లి సొంతం. ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా.. ఏ ఫార్మాట్‌లోనైనా పరుగుల వరద పారించే ఆటగాడిగా కోహ్లికి పేరుంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా జట్టును దూకుడుగా నడిపించడంలోనూ పేరు తెచ్చుకున్నాడు. అయితే.. తాజాగా కోహ్లి తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మార్క్ నికోలస్ నిర్వహించిన నాట్ జస్ట్ క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో.. తన జీవితంలోని కఠిన దశ గురించి వివరించాడు. అప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగిన 5 టెస్ట్‌ల్లో విరాట్ వంద పరుగులు కూడా చేయలేకపోయాడు. ఆ టూర్‌లో పది ఇన్నింగ్స్‌లో కోహ్లి 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6, 20 పరుగులు చేసి నిరాశపరిచాడు కోహ్లి. అనంతరం ఆసీస్‌తో జరిగిన సిరీస్‌తో మళ్లీ ఫాంలోకి వచ్చాడు.
previous post
ఏడుకొండలు మినహా అంతటా వైసీపీ రంగులే: పవన్ కళ్యాణ్