telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

రాగాల 24 గంటల్లో .. రెండు తుఫాన్ల ప్రభావం..

red alert in srikakulam on poni cyclone

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్ గురువారం మరింత తీవ్రమై పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల వైపు వెళుతుందని తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన మహా తుఫాన్ బలహీనపడి గుజరాత్ తీరం వైపు వెళుతోంది. వీటి ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై లేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని, తేమ గాలులు వీస్తున్నందున ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నారు.

రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్లో గంటలకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయన్నారు. భారతీయ తీరగస్తీ దళాలు తూర్పుతీరంలో అప్రమత్తమయ్యాయి. ఈస్ట్రన్ సీ బోర్డు కేంద్రంగా విశాఖపట్టణం, పారాదీప్, హల్దియా తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు 8 నౌకలు, 5 హెలికాప్టర్లను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకార బోట్లను, సిబ్బందిని వెనక్కి తీసుకొస్తున్నట్లు చెప్పారు.

Related posts