telugu navyamedia
సినిమా వార్తలు

కాజల్ హాలీవుడ్ ఎంట్రీ ?

Kajal-Agarwal

“ల‌క్ష్మీక‌ల్యాణం”తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కాజ‌ల్ అగ‌ర్వాల్ అనతికాలంలోనే టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. సినిమాల్లోకి వచ్చి దాదాపు దశాబ్దం గ‌డిచినా కాజ‌ల్ క్రేజ్ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్పటికీ ఆమెకు అవ‌కాశాలు వ‌స్తూనే ఉన్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం త్వరలోనే ఈ బ్యూటీ ఓ హాలీవుడ్ సినిమాలో న‌టించ‌నుందని స‌మాచారం. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం మంచు విష్ణు తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల్లో ఓ సినిమాను నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఓ హాలీవుడ్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కిస్తార‌ట‌. ఉమెన్ సెంట్రిక్ మూవీగా తెర‌కెక్క‌బోయే ఈ సినిమాలో కాజ‌ల్ వైవిధ్యమైన పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో కాజల్ హాలీవుడ్ ఎంట్రీ కూడా జరిగిపోతుంది. అయితే ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.

Related posts