telugu navyamedia
సినిమా వార్తలు

“మానాడు” ట్రైలర్ రిలీజ్ చేస్తున్న నేచురల్ స్టార్ నాని

తెలుగులోనూ సుప్రసిద్ధుడైన సూపర్ స్టైలిష్ తమిళ్ స్టార్ శింబు-కల్యాణి ప్రియదర్శన్ జంటగా… క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ‘సురేష్ కామాచి” 125 కోట్ల భారీ బడ్జెట్ తో హిందీ-తమిళ్-తెలుగు-కన్నడ-మలయాళ భాషల్లో నిర్మిస్తున్న బహుభాషా చిత్రం “మానాడు” ట్రైలర్ నేచురల్ స్టార్ నాని అక్టోబర్ 2, గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.

పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం. సుప్రసిద్ధ దర్శకులు భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. తమ చిత్రం ‘మానాడు’ తెలుగు ట్రైలర్.. నేచురల్ స్టార్ నాని విడుదల చేయనుండడం పట్ల దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.

 

Related posts