telugu navyamedia
సినిమా వార్తలు

తమిళ రీమేక్ కు సిద్ధమైన “మజిలీ”

majili movie on april 5th

శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగచైతన్య జంటగా నటించిన మజిలీ చిత్రం ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం థియేటర్లలో ఇప్పటికి తన దూకుడును కొనసాగిస్తోంది. సాధారణంగా ఏ భాషలోనైనా ఓ సినిమా హిట్ అయితే ఆ సినిమాను ఇతర భాషల్లో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. కోలీవుడ్ మీడియా ప్ర‌కారం మ‌జిలీ చిత్ర రీమేక్ రైట్స్ స్టార్ హీరో ధనుష్ ద‌క్కించుకున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే త‌న సొంత బ్యానర్ వండ‌ర్ బార్ ఫిలింస్ సంస్థ‌పై ధ‌నుష్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. మ‌రి ఇందులో హీరోగా ధ‌నుష్ న‌టిస్తాడా లేదంటే మ‌రో హీరోతో చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ధ‌నుష్ ప్ర‌స్తుతం “అసుర‌న్” అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు.

Related posts