telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

శ్యామ్‌ సింగ రాయ్ షూటింగ్ ప్రారంభించిన నాని…

Vijay Shyam Singa Rai

అష్టాచమ్మా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు నాచురల్ స్టార్. తరువాత అలా మొదలైందితో సినీ రంగంలో హీరోగా తన జీవితాన్ని మొదలు పెట్టాడు. అయితే ఈ ఏడాది మాత్రం నాని ఓకేఒక్క సినిమాను విడుదల చేశాడు. అదే నానీ, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మల్టీస్టారర్ తెరకెక్కిన సినిమా వీ. థియేటర్లు మూతబడటంతో ఓటీటీ వేదికగా ఈ సినిమాను విడుదల చేశారు. అనుకున్నంత స్థాయిలో ప్రజాదరణ పొందలేదు. అయినా నాని తన స్పీడు తగ్గించలేదు. వరుస సినిమాలు చేసేందుకు సిద్దమవుతున్నాడు. అయితే నానీ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమాలో సాయి పల్లవి, క్రితి శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీనికి రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వం చేయనున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ బాగా వైరల్ అయ్యింది. దీంతో పాటుగా టక్ జగదీష్ సిమాకు నానీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే నేడు శ్యామ్ సింగ రాయ్ షూటింగ్‌ను పూజా కార్యక్రమాలు చేసి మొదలు పెట్టారు. దీనికి నాని తండ్రి మొదటి క్లాప్ కొట్టి స్టార్ట చేశారు. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

Related posts