telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్ లో మరో విషాదం..

2020 సంవత్సరం చిత్ర పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్ట పోగా.. ప్రముఖ నటులు 2020లోనే మృతి చెందారు. తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది.  ఆర్ కె ఫిలిమ్స్ అధినేత, ప్రముఖ నిర్మాత కోవెలమూడి కృష్ణమోహన్ రావు మృతిచెందారు. కృష్ణమోహన్ రావు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు సోదరుడు. గత కొంత కాలంగా ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడుతున్న కృష్ణమోహన్ రావు ఈ రోజు మధ్యహ్నం కన్నుమూశారు. ఫిలింనగర్ లోని తన నివాసంలో కృష్ణమోహన్ రావు మృతి చెందారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. రేపు ఫిలిమ్ నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన మృతి తెలియగానే… సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు.

 

Related posts