telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ రహదారుల పై గడ్కరీతో చర్చించాం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Komatireddy comments TRS Elections

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణపై గడ్కరీతో చర్చించామన్నారు. రాష్ట్రంలో రోడ్లన్నీ నాశనం అయ్యాయని తెలిపారు. జాతీయ రహదారులుగా గుర్తిస్తారని, రాష్ట్ర ప్రభుత్వం గుంతలు కూడా పూడ్చడం లేదని దుయ్యబట్టారు.
హైదరాబాద్- విజయవాడ 8 లైన్ల రహదారిలో భాగంగా ఎల్బీనగర్‌ నుంచి కుత్బుల్లాపూర్‌ వరకు వదిలేశారని ఆరోపించారు.

నిన్న అటవీ అధికారుల పై దాడిని ప్రస్తావిస్తూ అటవీ అధికారులకు లైసెన్స్డ్‌ ఆయుధాలు ఇవ్వాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులకు రక్షణ కల్పించాలని, సచివాలయానికి రాని సీఎంకు కొత్త సచివాలయ భవనం ఎందుకని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగంపై కోర్టును ఆశ్రయిస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

Related posts