telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మలైకాతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అర్జున్ కపూర్

Arjun-Kapoor-and-Malaika-Arora-Khan

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తరచుగా కన్పిస్తూ ఉంటాయి. అర్జున్‌కపూర్, మలైకా అరోరాతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలుసార్లు కెమెరా కంటికి చిక్కడంతో త్వరలోనే ఒక్కటవ్వనున్నారనే వార్త కొన్నాళ్లుగా చక్కర్లు కొడుతోంది. అర్జున్ కపూర్ ప్రస్తుతం పానిపట్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌తో బిజీబిజీగా ఉన్నాడు అర్జున్‌కపూర్. ఇదిలా ఉంటే మలైకాతో వివాహం విషయమై అర్జున్ కపూర్‌ను మీడియా ప్రశ్నించగా… ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని, ఒకవేళ ఉంటే మొదట ఆ విషయాన్ని మీడియాతోనే చెబుతానని చెప్పాడు. ప్రస్తుతానికి తామిద్దరికీ పెళ్లి చేసుకునే ఆలోచన ఏమీ లేదని స్పష్టత ఇచ్చాడు.

Related posts