telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్ కోసం శ్రీముఖి రెమ్యూనిరేషన్ తెలిస్తే షాకే …!!

Srimukhi

ఎన్నో వివాదాల నడుమ మొదలైంది బిగ్ బాస్ సీజన్-3. కింగ్ నాగార్జున హోస్ట్‌గా మొదలైన ఈ షో 100 రోజులపాటు 15 మంది కంటెస్టెంట్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది. షో మొదలై ఆసక్తికరంగా సాగుతోంది. మొదటివారంలో హేమ ఎలిమినేట్ అయ్యింది. హౌజ్ లో నుంచి బయటకు వచ్చిన హేమ ప్రెస్ మీట్ పెట్టి మరీ “బిగ్ బాస్”పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె స్థానంలో వైల్డ్ కార్డు ఎంట్రీతో ట్రాన్సజెండర్ తమన్నా సింహాద్రి హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే కంటెస్టెంట్స్ లో ఒకరైన శ్రీముఖి ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి భారీ ప్లాన్‌తోనే వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా “బిగ్ బాస్” కోసం శ్రీముఖి తీసుకున్న రెమ్యూనరేషన్ విషయమై సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. శ్రీముఖికి ఇచ్చిన రెమ్యునరేషన్ ఇంత అంటూ కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. ఒకటి రెందు కాదు ఏకంగా 3.5 కోట్లకు పైగానే ఈ షో కోసం ఆమెకు పారితోషికంగా ఇచ్చారని తెలుస్తుంది. కానీ 100 రోజుల పాటు అక్కడ ఉండాలి కాబట్టి తనకు వచ్చే ఆదాయన్ని అంతా వదిలేసుకోవాలి కాబట్టి ఈ మాత్రం తీసుకోవడం తప్పేం కాదంటున్నారు శ్రీముఖి అభిమానులు. ప్రస్తుతానికి ఆమె బయటికి వచ్చే అవకాశాలు తక్కువే. పైగా షోలో కూడా ఫుల్ గ్లామర్ ఒలకబోస్తుంది శ్రీముఖి. ఇక ఇప్పటికే ఈ యాంకర్ తన పేరు మీద శ్రీముఖి ఆర్మీని క్రియేట్ చేసుకొని రంగంలోకి దిగింది. ఇంకా శ్రీముఖి ఆర్మీ పేరిట హౌజ్‌లో అమ్మడు చేసే హావభావాలు, టాస్క్‌లు అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం శ్రీముఖి టీమ్ అనే హ్యాష్‌ట్యాగ్ వైరల్ అవుతోంది. శ్రీముఖి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని. పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు అందరూ శ్రీముఖికి సపోర్ట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో కూడా పవన్ వీరాభిమానినే గెలిపించాలని ఫిక్స్ అయినట్లు సమాచారం.

Related posts