telugu navyamedia
తెలంగాణ వార్తలు

సీఎం బిశ్వశర్మ డీఎన్ఏ చైనాదా? అసోందా?..

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పుట్టుక‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వంత్ శర్మపై పోలీసు కేసులు పెడతామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.

అస్సాం ముఖ్యమంత్రి డీఎన్‌ఏ ఎంటి అని అడుగుతామన్న ఆయన… అస్సాం పక్కనే చైనా ఉంది కదా.. అసలు సీఎం బిశ్వశర్మ డీఎన్ఏ చైనాదా? అసోందా? అని ఆయన ప్రశ్నించారు.

ఒక మాతృమూర్తిని అవమానించేలా బిశ్వంత శర్మ వ్యవహరించారని రేవంత్ రెడ్డి మండి పడ్డారు. రేపు బిశ్వంత్ శర్మపై కేసులు పెడతామనిఅన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అస్సాం సీఎం మీద కేసులు పెట్టి నిరూపించుకోవాలని.. అప్పుడే కేసీఆర్‌ ఎవరికీ భయపడ్డడు అని అనుకుంటాం అని సవాల్ విసిరారు.

అమర్యాదకరమైన భాషను బీజేపీ నేతలు వాడుతున్నారన్నారు. బిశ్వంత్ శర్మపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ నేతల మూలాలను, డీఎన్ఏ లను పరిశీలించాల్సి వస్తుందన్నారు.

భారతీయ సంప్రదాయాలకు వారసులం అని చెప్పుకునే మోదీ ..ఇప్పటికైనా హేమంత్ బిశ్వశర్మను సీఎం పదవి నుంచి తొలగించాలని ఆయన కోరారు.

Related posts