telugu navyamedia
తెలంగాణ వార్తలు

భక్తితో ముక్తి లభిస్తుందని వేయేళ్ల కిందటే నిరూపించారు..

*శ్రీరామ న‌గ‌రాన్ని సంద‌ర్శించిన రామ‌నాథ్‌
*శ్రీరామ‌న‌గ‌రంలో స‌మాన‌త్వంవెల్లువ‌రిస్తుంది..
*దివ్య‌దేశాల‌ను ద‌ర్శించికున్న రాష్ర్ట‌ప‌తి కుటుంబం..
*స‌మ‌తామూర్తినిద‌ర్శించుకున్న రాష్ర్ట‌ప‌తి
*రామానుజ విగ్రహం ఏర్పాటు చేసి చిన జీయర్ స్వామి చరిత్ర సృష్టించారు
*భక్తి మార్గాన్ని, సమానత్వాన్ని రామానుజాచార్యులు నిర్ధేశించారు..
* భక్తితో ముక్తి లభిస్తుందని వేయేళ్ల కిందటే నిరూపించారు

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​ శ్రీరామ‌న‌గ‌రంలోని జగద్గురు రామానుజాచార్యుల వేడుక‌లు ఘ‌నంగా సాగుతోంది. ముచ్చింతల్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు పాల్గొన్నారు..

ఈ మేరకు సమతా మూర్తి విగ్రహాన్ని వారు దర్శించుకున్నారు. అనంతరం శ్రీరామనగరంలో కొలువై ఉన్న 108 వైష్ణవ ఆలయాలను దర్శించుకున్నారు. ఆ తర్వాత భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 54 అడుగుల‌ 120 కిలోల స్వర్ణమూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ లోకార్పణం చేశారు.

అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. రామానుజ విగ్రహం ఏర్పాటు చేసి చిన జీయర్ స్వామి చరిత్ర సృష్టించారని తెలిపారు. భగవంతుని దర్శనానికి పూజారి అవసరం లేదని రామానుజాచార్యుల వారు ఆనాడే చెప్పారని వివరించారు. భక్తితో ముక్తి లభిస్తుందని వేయేళ్ల కిందటే నిరూపించారని రాష్ట్రపతి పేర్కొన్నారు.

భక్తి మార్గాన్ని, సమానత్వాన్ని రామానుజాచార్యులు నిర్ధేశించారని తెలిపారు. శ్రీరామ‌న‌గ‌రం 108 దివ్యదేశాల ఏర్పాటుతో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోందన్నారు. ఈ క్షేత్రం ఏర్పాటుతో తెలంగాణలో కొత్త సాంస్కృతిక జీవనం మొదలైందని పేర్కొన్నారు.

రామానుజాచార్యుల శిష్యులల్లో ఎక్కువ మంది వెనుకబడిన వర్గాల వారేనని, రామానుజాచార్యుల సమానత్వ ఆలోచనలు మన రాజ్యాంగములో కనిపిస్తాయని రాష్ట్రపతి తెలిపారు. సమతా మూర్తి విగ్రహ స్పూర్తితో లోక కల్యాణం కోసం కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

Related posts