telugu navyamedia
తెలంగాణ వార్తలు

జూబ్లీహీల్స్ గ్యాంగ్​రేప్​ కేసు : నిందితుల డీఎన్​ఏ సేకరణకు కోర్టు అనుమతి

సంచ‌ల‌నం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్​లో మైన‌ర్ బాలికపై రేప్‌ కేసులో మ‌రో ట్విస్ట్ నెల‌కొంది. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 

ఈ కేసులో నిందితుల డీఎన్​ఏ సేకరించడానికి పోలీసులు కోర్టును అనుమతి కోరగా న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిందితుల నుంచి పోలీసులు డీఎన్​ఏ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే.. బాలిక‌పై రేప్‌ జరిగిన ఇన్నోవా కారులో ఆధారాలు సేకరించారు పోలీసులు. డీఎన్​ఏ సేకరించిన తర్వాత వాహనంలోని ఆధారాలతో పోల్చనున్నారు. నిందితులు ఇన్నోవా వాహనంలోనే ఉన్నట్లు నిరూపించడానికి డీఎన్​ఏ టెస్ట్ కీల‌కంగా ఉపయోగపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. అవసరమైతే బాధితురాలి డీఎన్​ఏను సేకరించే యోచనలో ఉన్నారు.

ఇప్ప‌టికే బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.నిందితుల పాస్‌పోర్ట్‌ల‌ను సైతం సీచ్ చేయాల‌ని పోలీసులు కోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంది.నిందితుల‌కు బెయిల్ ల‌భిస్తే దేశం వ‌దిలి వెళ్లే అవ‌కాశాలు ఉన్న‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్ప‌టికే అరుగురు బెయిల్ పిటీష‌న్‌ను కోర్టు తిర‌స్క‌రించిన విష‌యం విదిత‌మే.

కాగా మే 28న మైనర్ బాలికను సాదుద్దీన్ సహా మరో ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు.ఈ కేసులో ఐదుగురు మైనర్లతో పాటు ప్రధాన నిందితుడు సాదుద్దీన్​ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అందర్ని కొన్ని రోజుల పాటు రిమాండ్​లో ఉంచి విచారించారు. ప్రస్తుతం సాదుద్దీన్ చంచల్​గూడ జైల్లో ఉండగా.. ఐదుగురు మైనర్లు జువైనల్ హోంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Related posts