వచ్చే నెలలో దాదాపు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో అన్ని పార్టీలు భాగ్యనగర వీధుల్లో పర్యటిస్తున్నాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య ఈ వార్ మరింతగా ముదిరింది. తాజాగా..టీఆర్‌ఎస్ పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఓటుకు 10 వేలు పంచుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వరద వచ్చిన ప్రాంతాల్లో చాలా మందికి ఆర్థిక సహాయం అందించడంలో టీఆర్‌ఎస్ విఫలమైందని ఆయన ఆరోపించారు. వరద బాధితుల ఇల్లు కూలితే లక్ష రూపాయలు, ఇల్లు ధ్వంసమైతే 50 వేలు, ఇల్లు నీట మునిగితే 10 వేల రూపాయలు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పుకున్నారని…ఆయితే అవన్నీ ఏ జీఓ ప్రకారం ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు రాజాసింగ్. ఇప్పటికి నీటిలో ప్రాంతాలను, కూలిపోయిన ఇళ్లను తొలగించడంతో టీఆర్‌ఎస్ పూర్తిగా విఫలమైందని రాజాసింగ్ అన్నారు. రూ. 10వేల రూపాయలు కేవలం టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల ఇళ్లకే వెళ్తున్నాయని ఫైర్ అయ్యారు.
previous post
next post