telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పండగ ఉందని తెలిసి కూడా..మూడో తేదీ తర్వాత జీతాలు ఇస్తారా?: లోకేశ్

Minister Lokesh comments YS Jagan

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు వచ్చే నెల మూడో తేదీన బ్యాంకులో జమకానున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. “జగన్ గారూ మీరంటే లక్ష కోట్లకు అధిపతులు. మీకు జీతంతో పనిలేదు. కానీ, ఉద్యోగుల పరిస్థితి వేరు. సెప్టెంబరు 2న వినాయకచవితి ఉందని తెలిసి కూడా సెలవులు సాకుగా చూపి మూడో తేదీ తర్వాత జీతాలు ఇస్తారా? పెన్షనర్ల పరిస్థితి కూడా ఇంతే కదా? వైఎస్ జగన్ గారి ప్రభుత్వం ప్రజల్ని అప్పు చేసి పండుగ చేసుకోమంటోంది” అంటూ ట్విటర్ లో విమర్శలు చేశారు.

సెప్టెంబరు 1న ఆదివారం ఆ మరుసటి రోజున వినాయకచవితి కావడంతో వరుసగా బ్యాంకులకు రెండ్రోజులు సెలవులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు ఖాతాలో పడతాయన్నది అనిశ్చితిగా మారింది.

Related posts