telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో రేపు తేలికపాటి వర్షాలు!

rain hyderabad

ఉత్తర ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళే కొద్దీ నైఋతి దిశ వైపు తిరిగి ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

దక్షిణ గుజరాత్ నుండి అల్పపీడన అనుబంధ ఉపరితల ఆవర్తనం వరకు దక్షిణ చత్తీస్‌గఢ్, విదర్భ మరియు ఉత్తర మధ్య మహారాష్ట్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు రేపు చాలా ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Related posts